● కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్
గోవిందరావుపేట: అర్హులందరికీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి సీతక్క ఆదేశాల మేరకు తహసీల్దార్ రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అశోక్ హాజరై లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా జారీ చేయలేదన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందించడంతో పాటు కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, సర్పంచ్ జోగా నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ, నాగమణి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


