బిల్ట్‌ ఇన్‌టేక్‌వెల్‌ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

బిల్ట్‌ ఇన్‌టేక్‌వెల్‌ పరిశీలన

Nov 6 2026 1:44 AM | Updated on Nov 6 2026 1:44 AM

మంగపేట : మండల పరిధిలోని కమలాపురం గోదావరి ఒడ్డున గల బిల్ట్‌ ఇన్‌టేక్‌వెల్‌ను మిషన్‌ భగీరథ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ చలమారెడ్డి ఆధ్వర్యంలో గ్రామీణ నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గురువారం పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా పరిశీలించారు. కమలాపురంలోని వాటర్‌ గ్రిడ్‌లో శుద్ధి చేసిన గోదావరి నీటిని గ్రామాల్లోకి సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. వాటర్‌ గ్రిడ్‌కు గోదావరి నీటిని పంపింగ్‌ చేసేందుకు ఏటూరునాగారం మండలంలోని రాంనగర్‌ వద్ద ఏర్పాటు చేసిన మిషన్‌ భగీరఽథ ఇన్‌టేక్‌వెల్‌ వద్ద ఇప్పటికే గోదావరి నీరు లేక పోవడంతో తాగునీటి సమస్య ఏర్పడింది. రానున్న వేసవి కాలంలో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని వివరించారు. గతంలో కమలాపురం బిల్ట్‌ ఫ్యాక్టరీ గోదావరి నీటిని వినియోగించేందుకు ఏర్పాటు చేసిన ఇంటెక్‌ వెల్‌ను వినియోగిస్తే తాగునీటి సమస్య రాకుండా ఉంటుందని గమనించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ సునీత, డీఈ సుమన మిషన్‌ భగీరథ గ్రిడ్‌ ఇన్‌చార్జ్‌ ఏఈ పవన్‌, ఆర్‌ఐ శ్రీనివాస్‌, జీపీఓ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement