‘ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి’ | - | Sakshi
Sakshi News home page

‘ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి’

Nov 6 2026 1:44 AM | Updated on Nov 6 2026 1:44 AM

ములుగు: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌(టీజీవో) జిల్లా అధ్యక్షుడు ఎం.సంపత్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని టీజీవో భవనంలో గురువారం జిల్లా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ అమలు, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎం.సంపత్‌రావు మాట్లాడుతూ వివిధ కార్యక్రమాల్లో గెజిటెడ్‌ అధికారుల పాత్ర విస్తరించాలని సూచించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి జీవన్‌కుమార్‌ మాట్లాడుతూ నూతన సభ్యుల చేరికతో సంఘం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకుసాగుతామని వెల్లడించారు. ఈ సమావేశంలో కోశాధికారి ఎం.ప్రకాశ్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు కె.శిరీష, ఏ. రాజ్‌ కుమార్‌, బి.యశ్వంత్‌, జి.దుర్గారావు, డి.రాజు, టి.సారంగపాణి, కె.సందీప్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement