చట్టాలపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన ఉండాలి

Nov 6 2026 1:44 AM | Updated on Nov 6 2026 1:44 AM

● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

కార్యదర్శి కె.చండీశ్వరీదేవి

వెంకటాపురం(ఎం): చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.చండీశ్వరీదేవి అన్నారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపేటలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం న్యాయ విజ్ఞానసదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు, విద్యార్థులు, గ్రామీణ ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పోక్సో చట్టం, సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అర్హులకు ఉచిత న్యాయ సలహాలు, సూచనలు అందజేస్తామని తెలిపారు. న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా న్యాయ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ మేకల మహేందర్‌, ఎస్సై చల్ల రాజు, సర్పంచ్‌ వంశావతి, ఉప సర్పంచ్‌ కె.తిరుపతి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, ఏఈఓ డి.దయన, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement