ములుగు రూరల్: సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ అన్నారు. ఈ మేరకు బుధవారం మున్సిపాలిటీ పరిధి జీవింతరావుపల్లి, గణేశ్లాల్పల్లి ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన సౌకర్యాల నిమిత్తం రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ సంపత్


