చెకుముకి సైన్స్‌ సంబురాల పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

చెకుముకి సైన్స్‌ సంబురాల పోస్టర్‌ ఆవిష్కరణ

Nov 5 2026 12:58 AM | Updated on Nov 5 2026 12:58 AM

ములుగు: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న చెకుముకి సైన్స్‌ సంబురాలు–2026 పోస్టర్‌ను కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావుతో కలిసి రాష్ట్ర మంత్రి సీతక్క బుధవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. నవంబర్‌ 12న పాఠశాల స్థాయి, 21న మండలం, నవంబర్‌ 29న జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 12, 13వ తేదీల్లో మేడ్చల్‌లోని సీఎంఆర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో రాష్ట్ర స్థాయి సైన్స్‌ సంబురాలు ఉంటాయని వివరించారు. వీటిలో భాగంగా సైన్స్‌ ప్రదర్శనలు, మ్యాజిక్‌ షో, శాస్త్రవేత్తలతో ముఖాముఖి, సైన్స్‌ కార్నివాల్‌ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సిద్ధార్థరెడ్డి, డీడీ జనార్దన్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రవిచంద్ర పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement