అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

Nov 5 2026 12:58 AM | Updated on Nov 5 2026 12:58 AM

● మాజీ ఎమ్మెల్యే

ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

ములుగు/ములుగు రూరల్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓటర్ల ఎన్‌ రోల్‌మెంట్‌ ఇన్‌చార్జ్‌ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కోరారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియపై ముఖ్య నాయకులతో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు అత్యంత కీలకమైనవని తెలిపారు. సమాజంలో చైతన్యవంతమైన పట్టభద్రులు సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. అర్హులందరినీ ఓటరుగా నమోదు చేయించడమే బీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష్యమని సూచించారు. అనంతరం వరంగల్‌–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌బాబు మాట్లాడారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పట్టభద్రులకు ఎమ్మెల్సీ ఓటు నమోదుపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసపూరిత గ్యారంటీలతో గద్దెనెక్కిందన్నారు. పట్టభద్రులు, యువత, ఉపాధ్యాయుల హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్‌ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గోవింద్‌నాయక్‌, జంపన్న, విజయ్‌, ప్రదీప్‌రావు, మహేశ్‌, వేణు, సూరయ్య, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement