పెంచిన పన్నులు తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

పెంచిన పన్నులు తగ్గించాలి

Nov 5 2026 12:58 AM | Updated on Nov 5 2026 12:58 AM

ములుగు రూరల్‌: మున్సిపాలిటీ పరిధిలోని పెంచిన పన్నులను తగ్గించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో అర్బన్‌ అధ్యక్షుడు ఇమ్మడి రాకేశ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో వాణిజ్య, వ్యాపార, ఇంటి పన్నులను 8 రేట్లు పెంచడంతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మున్సిపాలిటీ నిబంధనల మేరకు మూడేళ్ల పాటు పంచాయతీ పరిధి పన్నులను వసూల్‌ చేయాలనే నిబంధనలు ఉందని తెలిపారు. అయినా నిబంధనలకు వ్యతిరేకంగా అధికారులు, పాలకవర్గ సభ్యులు ఏకపక్ష నిర్ణయాలతో పన్నులు పెంచారని వివరించారు. పెంచిన పన్నులను ఈ నెల 11వ తేదీ లోపు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి 12వ తేదీన మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్‌రెడ్డి, రవీంద్రాచారి, అల్లె శోభన్‌, రాజ్‌కుమార్‌, శ్రీహరి, రాయంచు నాగరాజు, రాకేశ్‌, కిశోర్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement