జిల్లాలో మండలాల వారీగా సాగైన వరిపంట వివరాలు (ఎకరాల్లో)
కోతదశకు వచ్చిన వరిపంట నేలపాలు
తుపానుతో భయంగా ఉంది..
3 ఎకరాల వరిపంట నేలవాలింది..
ములుగు: వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందే సమయంలో ప్రకృతి కన్నెర చేస్తుండడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. అర్నబ్ తుపాను నుంచి రైతాంగం తేరుకోకముందే మురసు తుపాన్ అన్నదాతలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వర్షాలతో పాటు ఈదురుగాలులు అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. జిల్లాలో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటకు మురసు తుపాను ప్రభావంతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే జిల్లాలోని పలు మండలాల్లో గాలుల తీవ్రతకు బరువెక్కిన వరి కంకులు నేలవాలుతుండగా మరికొన్ని చోట్ల వర్షాలకు పొలాలు తడిసిముద్ధవుతున్నాయి. నెలల తరబడి కష్టపడి సాగు చేసిన పంట కళ్లముందే దెబ్బతింటుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
94,160 ఎకరాల్లో వరిసాగు
జిల్లాలో వరి ప్రధాన పంటగా సాగవుతోంది. 10 మండలాల పరిధిలో సుమారు 94,160 ఎకరాల్లో వరిసాగు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో చాలా వరకు వరిపంట సాగు తగ్గింది. ఆకసాయి పంటలు సైతం చాలా చోట్ల ఎండిపోయాయి. చెరువులు, కుంటలతో పాటు బోరు మోటార్ల కింద సాగుచేసిన వరిపంట చేతికందే సమయంలో వర్షాలు అన్నదాతలను కలవరపెడుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం పంటలు కోత దశకు చేరుకున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కోతలు ప్రారంభం కాగా మరికొన్ని గ్రామాల్లో పంటకోతకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో వాతావరణంలో మార్పులు, కురుస్తున్న వర్షాలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కోతదశలో ఉన్న వరిపంట సైతం బలంగా వీస్తున్న ఈదురుగాలులకు తట్టుకోలేక నేలవాలుతున్నాయి.
కరువు పరిస్థితుల నుంచి..
ఈ ఏడాది వానాకాలంలో వర్షాభావ పరిస్థితులు రైతులను ఇబ్బందులకు గురిచేశాయి. జిల్లాలోని గోవిందరావుపేట, ఏటూరునాగారం, వెంకటాపురం(కె), మంగపేట మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఒకవైపు వర్షాల కొరతతో సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు మరోవైపు పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. ప్రతిఏటా ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతలను వెంటాడుతున్నాయి.
పెట్టుబడుల భారం
పంటలు సాగుచేసేందుకు రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు, సాగునీటికి భారీగా పెట్టుబడులు పెట్టారు. పంట దిగుబడి వస్తే అప్పులు తీర్చవచ్చని ఆశించారు. తీరా కోత సమయానికి వర్షాలు పడుతుండడంతో వారి ఆశలు ఆవిరవుతున్నాయి. నేలవాలిన పంటను కోయడానికి అదనపు కూలీలు అవసరం కావడంతో ఖర్చులు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది. దిగుబడి తగ్గితే పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
ధాన్యం కొనుగోళ్లపైనా ప్రభావం
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లినప్పుడు తేమశాతం, నాణ్యత పేరుతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే కోతలు, ధాన్యం ఆరబెట్టడం, రవాణా వంటి పనులకు అదనపు ఖర్చులు అవుతున్నాయి. వర్షాలు ఇలాగే కురిస్తే ధాన్యం నిల్వ చేయడం కూడా కష్టంగా మారనుంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యం విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
మోస్తరుగా వర్షం
మంగపేట : మురసు తుపాన్ ప్రభావంతో మండల వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు ఒక మోస్తరుగా ఎడతెరిపి లేని వర్షం పడుతూనే ఉంది. వర్షం కారణంగా పలుచోట్ల వరిపైరు నేలవాలుతోంది. తుపాను ప్రభావం మరింత పెరిగితే కోత దశకు చేరుకున్న వందల ఎకరాల్లోని వరిపంట నేలవాలే ప్రమాదం ఉందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
గోవిందరావుపేట 11,000
కన్నాయిగూడెం 2,219
మల్లంపల్లి 5,900
వెంకటాపురం(ఎం) 19,741
ఎస్‌ఎస్‌తాడ్వాయి 3,000
ఏటూరునాగారం 10,842
వెంకటాపురం(కె) 5,300
మంగపేట 21,900
ఈదురుగాలులు, వర్షాలతో
ఒరిగిపోతున్న పంటలు
దిగుబడిపై రైతన్నల ఆందోళన
ములుగు
9,558
వాజేడు
4,700
20 ఎకరాల్లో వరిపంట సాగు చేశాను. 6 ఎకరాల్లో వరి కోతకు వచ్చింది. అర్నబ్ తుపాన్‌తో పాటు మురసు తుపాను ప్రభావంతో వరిపంట నేలవాలుతోంది. సుమారు రూ.4 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వరిపంటను సాగు చేశాను. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు ఆందోళనను కలిగిస్తున్నాయి.
– మంచాల రాజేశ్, తిమ్మంపేట
మండల కేంద్రం పరిధిలో 15 ఎకరాల్లో వరిపంట సాగు చేశాను. ఇప్పటికే 3 ఎకరాలకు పైగా వరిపంట నేలవాలింది. వర్షపు నీరు బయటకు వెళ్లడానికి కాల్వ తీసినప్పటికీ నీరు పోవడం లేదు. వరిపంట మొలకెత్తే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సైతం ప్రారంభించకపోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
– రెడ్డి శంకర్, వెంకటాపురం(ఎం)


