పటేల్‌ సేవలు మరువలేనివి | - | Sakshi
Sakshi News home page

పటేల్‌ సేవలు మరువలేనివి

Nov 1 2026 12:56 AM | Updated on Nov 1 2026 12:56 AM

● అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ

ములుగు: భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ దేశానికి అందించిన సేవలు మరువలేనివని అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) మహేందర్‌జీ అన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గల సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో వల్లభాయ్‌ చిత్రపటానికి అదనపు కలెక్టర్టు మహేందర్‌జీ, సంపత్‌రావు(స్థానిక సంస్థలు) పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని ఐకమత్యంగా ఉంచడంలో కృషిచేసిన ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. దేశానికి దిశ, నిర్దేశం చేసిన ఆయన చిరస్మరణీయుడని కొనియాడారు. దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితమవుతానని, దేశ అంతర్గత భద్రతను పటిష్ట పర్చడానికి స్వీయ తోడ్పాటు అందిస్తానని అదనపు కలెక్టర్‌ అధికారులు, ఉద్యోగుల చేత రాష్ట్రీయ ఏక్తా దినోత్సవ ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement