వర్షంతో ఆగమాగం | - | Sakshi
Sakshi News home page

వర్షంతో ఆగమాగం

Nov 1 2026 12:56 AM | Updated on Nov 1 2026 12:56 AM

ఏటూరునాగారం/వాజేడు: ఏటూరునాగారం మండల పరిధిలోని పలుచోట్ల శనివారం తెల్లవారుజామున గాలిదుమారంతో కూడిన వర్షం కురవడంతో వరిపంట ఆగమాగమైంది. దీంతో వరిపంట నేలవాలడంతో పాటు ధాన్యం నేలరాలిందని రైతులు వాపోతున్నారు. చేతికి అందివచ్చిన పంట నేలరాలడంతో రైతులు కన్నీటిపర్యంతం అవున్నారు. వర్షాలు లేక కుంటలు, చెరువులు ఎండిపోయి కనిపించగా శనివారం కురిసిన వర్షానికి ఎర్రకుంటలోకి కొంతమేర వర్షపు నీరు వచ్చి చేరింది. అదే విధంగా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో సాగు చేసిన మిరప తోటలు మునిగాయి. వర్షం భారీగా పడడంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వర్షపు నీరు తోటల్లోకి వచ్చి చేరింది. దీంతో చీకుపల్లి, పెద్ద గొళ్లగూడెం గ్రామాల మధ్యన అప్రోచ్‌ రోడ్డు వద్ద వేసిన తూముల నుంచి నీరు త్వరగా బయటకు వెళ్లకపోవడంతో తోటల్లోకి వర్షం నీరి వచ్చినట్లు రైతులు తెలిపారు. నీట మునిగిన మొక్కలు బతుకుతాయో లేదోననే ఆందోళన రైతుల్లో నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement