సైబర్‌ నేరాలపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై అప్రమత్తం

Nov 1 2026 12:56 AM | Updated on Nov 1 2026 12:56 AM

● ఎస్పీ సుధీర్‌రాంనాథ్‌ కేకన్‌

ములుగు రూరల్‌: సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి నుంచి బస్టాండ్‌ వరకు శనివారం విద్యార్థులతో టార్చ్‌లైట్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ప్రజలు సైబర్‌ నేరాల బారిన పడకుండా అప్రమత్తం చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాలు, ఫేక్‌ కాల్స్‌, నకిలీ వెబ్‌సైట్లు, అనుమానాస్పద లింకులు, డిజిటల్‌ అరెస్టుల పేరుతో జరుగుతున్న మోసాలపై అవగాహన కల్పించారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీ, పాస్‌వర్డ్‌, యూపీఐ పిన్‌లు చెప్పకూడదని వివరించారు. అనుమానాస్పద కాల్స్‌ వస్తే వెంటనే జాతీయ సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930 కాల్‌ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ సురేశ్‌కుమార్‌, ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్‌, వెంకటాపురం(ఎం) ఎస్సై చల్లా రాజు, ఎస్సైలు చంద్రశేఖర్‌, రుచిత్ర, సాయిక్రిష్ణ, సైబర్‌ సెక్యురిటీ ఇన్‌చార్జ్‌ కానిస్టేబుల్‌ శ్రీకాంత్‌, కౌన్సిలర్‌ పావని, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement