అవినీతి రహిత సమాజమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అవినీతి రహిత సమాజమే లక్ష్యం

Nov 1 2026 12:56 AM | Updated on Nov 1 2026 12:56 AM

● ఏసీబీ డీఎస్పీ సాంబయ్య

ములుగు: అవినీతి రహిత సమాజమే లక్ష్యమని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) వరంగల్‌ రేంజ్‌ డీఎస్పీ సాంబయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో విజిలెన్స్‌ వారోత్సవం–2026లో భాగంగా శనివారం ‘సత్యనిష్ఠతో సమృద్ధి’ నినాదంతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు, సిబ్బందితో అవినీతికి దూరంగా ఉంటూ నిజాయతీ, నిష్పక్షపాతంతో విధులు నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేయవద్దని సూచించారు. పారదర్శక పాలన, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఫిర్యాదులపై సత్వర చర్యలతో అవినీతిని అరికట్టవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మహేందర్‌ జీ మాట్లాడుతూ నిజాయతీతో పనిచేస్తూ అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ఉద్యోగులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్‌ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) సంపత్‌రావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement