ములుగు: ఉద్యోగులకు రెండు కరువు భత్యాలు (డీఏ) బకాయిలను ఈ నెల జీతంతో కలిపి చెల్లించేలా నిర్ణయం తీసుకున్నందుకు మంత్రి దనసరి సీతక్కను జిల్లా ఉద్యోగ సంఘాల నాయకులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు డీఏ బకాయిల చెల్లింపునకు నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీజీఓ), తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్జీఓ) నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే పీఆర్సీని కూడా సంక్రాంతి పండుగలోగా ప్రకటించి అమలు చేయాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో టీజీఓ జిల్లా అ ధ్యక్షుడు ఎం.సంపత్‌రావు, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షు డు పోలు రాజు, టీజీఓ జిల్లా కార్యదర్శి కందుల జీవన్‌కుమార్, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి మేడి చైత న్య, డీపీఓ వెంకయ్య, రఫీక్, రాజ్‌కుమార్, కుమారస్వామి, దుర్గారావు, రాజు, ప్రదీప్, రాకేష్, శివగణేష్, బాలయ్య, అనిల్‌కుమార్, స్రవంతి, ప్రత్యూష, స్నేహ, రాజేష్, మాలతి, సుప్రియ పాల్గొన్నారు.


