మెరుగైన పోలీస్‌ సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన పోలీస్‌ సేవలు అందించాలి

Oct 31 2026 8:01 AM | Updated on Oct 31 2026 8:01 AM

వెంకటాపురం(కె): ప్రజలకు మెరుగైన పోలీస్‌ సేవలను అందించాలని ఎస్పీ సుధీర్‌ రామ్‌ నాథ్‌ కేకన్‌ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్‌ పరిసరాలు, రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించి వివిధ రికార్డులు, రిసెప్షన్‌ కౌంటర్‌, సీసీటీఎస్‌ఎస్‌ నమో దు వివరాలు, ఈ–సాక్ష్య అమలు పురోగతిని సమీ క్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసులకు సంబంధించిన రికార్డులను నిబంధనల ప్రకా రం నిర్వహించాలని, పెండింగ్‌లో ఉన్న పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ మమన్‌ భట్‌, సీఐ ముత్యం రమేష్‌, సీఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రశాంత్‌, ఎస్సైలు తిరుపతి రావు, సతీష్‌ పాల్గొన్నారు.

ఎస్పీ సుధీర్‌ రామ్‌నాథ్‌ కేకన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement