హేమాచలుడి హుండీ ఆదాయం రూ.6.84లక్షలు | - | Sakshi
Sakshi News home page

హేమాచలుడి హుండీ ఆదాయం రూ.6.84లక్షలు

Oct 31 2026 8:01 AM | Updated on Oct 31 2026 8:01 AM

మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో ఆలయ ఇన్‌చార్జ్‌ కార్యనిర్వాహణ అధికారి వీరస్వామి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు శుక్రవారం జరిగింది. 2026 జూలై 7 నుంచి అక్టోబర్‌ 29వ తేదీ వరకు ఏర్పాటు చేసిన 9 హుండీల్లో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను దేవాదాయ ధర్మాదాయ శాఖ కొమ్మాల దేవస్థాన కార్యనిర్వాహణ అధికారి పి.ప్రసాద్‌ పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించారు. ఇందులో రూ.6,84,975 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి వీరస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం సేవా భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement