ఏటూరునాగారం: గిరిజన సంక్షేమ శాఖ హాస్టళ్లలోని విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంతోపాటు హాస్టళ్ల నిర్వహణలో నిర్దేశిత ప్రమాణాలు పాటించాలని ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శా ఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తు అధికారులకు సూచించారు. శుక్రవారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏటూరునాగారంలో ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో, అదనపు ప్రాజెక్టు అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీసీలో ఐటీడీఏ పరిధిలోని డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు, ఇంజనీరింగ్ విభాగా ల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, విద్యార్థులకు అందిస్తున్న డైట్, కాస్మోటిక్స్ ఛార్జీలు, అద్దె చెల్లింపులు, పెండింగ్ బిల్లుల అంశాలపై సమీక్షించారు.
వైద్య సేవలు, సిబ్బంది ఖాళీలపై చర్చ
గిరిజన ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది ఖాళీలు, అవసరమైన సిబ్బంది నియామక ప్రతిపాదనలపై చర్చించారు. సంబంధిత ఐటీడీఏల పరిధిలోని ఆస్పత్రులకు అవసరమైన సిబ్బంది వివరాలను సమర్పించాలని సూచించారు. అలాగే హాస్టళ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు తదితర సంస్థలను అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు. జీసీసీకి సంబంధించిన పెండింగ్ బిల్లులను పరిశీలించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
యూనిఫాం తయారీ
గడువులోగా పూర్తి చేయాలి
విద్యార్థులకు యూనిఫాం తయారీ, సరఫరా పురోగతిని సమీక్షించారు. నేవీ బ్లూ రంగు యూనిఫాంలో రెండు జతలను కుట్టించే పనులు 80 శాతం పూర్తయినట్లు వివరించారు. మిగిలిన పనులతో పాటు తెలుపు రంగు యూనిఫాంలను తయారు చేయడం, సరఫరాను కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులకు అందించాల్సిన ఉపకార వేతనాల చెల్లింపులు నవంబర్ 15వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. జీసీసీకి సంబంధించిన భూములను రాష్ట్రస్థాయి బృందం క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఆ బృందం అభిప్రాయాలు, పరిశీలన అనంతరం భూముల వివరాలన్నంటిని పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించే కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.
ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు
ఏటూరునాగారంలో ఐటీడీఏల
రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం
పాల్గొన్న పీఓ లెనిన్ వత్సల్ టొప్పో, అధికారులు


