మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి సారించాలి

Oct 31 2026 8:01 AM | Updated on Oct 31 2026 8:01 AM

● బాణసంచా దుకాణాల అనుమతుల

జారీలో నిబంధనలు పాటించాలి

● అదనపు కలెక్టర్‌ సీహెచ్‌ మహేందర్‌జీ

ములుగు: రహదారి ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్‌ రెవెన్యూ సి.హెచ్‌.మహేందర్‌ జి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో రహదారి భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణ, బాణసంచా దుకాణాల అనుమతులు, భద్రతా చర్యలపై అదనపు కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు ప్రమాదకర ప్రదేశాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. హెల్మెట్‌, సీటు బెల్ట్‌ వినియోగం, ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో గంజాయి సాగు, విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. దీపావళి సందర్భంగా బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకునే వ్యాపారులు అగ్నిమాపక శాఖతోపాటు సంబంధిత శాఖల నుంచి నిరభ్యంతర ధ్రువపత్రాలు పొంది, వాటి ఆధారంగా కలెక్టర్‌ నుంచి తాత్కాలిక లైసెన్సులు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ రవీందర్‌, రోడ్డు భవనాలశాఖ అధికారి శ్యామ్‌ సింగ్‌, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి, రవాణా శాఖ అధికారి ఈశ్వర్‌ సింగ్‌ ఠాకూర్‌, డీఎఫ్‌ఓ నాగరాజు, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు మహేష్‌ బాబు, మున్సిపాలిటీ కమిషనర్‌ సంపత్‌ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement