సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలి | - | Sakshi
Sakshi News home page

సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలి

Oct 31 2026 8:01 AM | Updated on Oct 31 2026 8:01 AM

● అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు

ములుగు: స్థానిక సమస్యలకు పరిష్కారం చూపే సృజనాత్మక ఆలోచనలతో విద్యార్థులు ముందుకు సాగాలని అదనపు కలెక్టర్‌ స్థానిక సంస్థలు ఎం.సంపత్‌ రావు సూచించారు. ఇన్నోవేషన్‌ పంచాయతీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ములుగులో నిర్వహించిన వాక్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ములుగు జూనియర్‌ కళాశాల నుంచి మెయిన్‌ రోడ్డు మీదుగా జిల్లా విద్యాశాఖ కార్యాలయం వరకు ఈ వాక్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలోని ప్రతిభను వెలికితీసి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడమే ఇన్నోవేషన్‌ పంచాయతీ కార్యక్రమం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ్‌ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి వీరేందర్‌, ఈడీఎం దేవేందర్‌, ప్రిన్సిపాల్‌ భగవద్గీత, టీజీఐసీ గ్రాస్‌రూట్‌ లీడ్‌ రమేష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement