న్యూస్‌రీల్
దేవాదుల
ఎయిర్‌వాల్వ్ లీకేజీ
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని నర్సింగపురం గ్రామ శివారులో దేవాదుల పైపులైన్ ఎయిర్‌వాల్వ్ లీకేజీ కావడంతో నీరు పైకి ఎగిసిపడుతూ వృథాగా పోతోంది. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
పైపులైన్ పనులు
త్వరగా పూర్తిచేయాలి
ములుగు: మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి రోడ్డులో గల వ్యవసాయ కార్యాలయం సమీపంలో చేపట్టిన పైపులైన్ మరమ్మతు పనులను మున్సిపల్ కమిషనర్ గురువారం పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. మరమ్మతుల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
నిర్మాణ పనులు
వేగవంతం చేయాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లా కోర్టులో న్యాయమూర్తులను నియమించి, నూతన కోర్టు భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ జె.శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు. అంతకు ముందుకు మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందించి శాలువతో సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనూరి సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు ఆధ్వర్యంలో హైకోర్టులో న్యాయమూర్తిని కలిసి జిల్లాలో న్యాయవ్యవస్థకు సంబంధించిన సమస్యలను వివరించారు. న్యాయమూర్తుల నియామకం, మౌలిక సదుపాయాల అభివృద్ధితో కేసుల పరిష్కారం వేగవంతమవుతుందన్నారు.
జిల్లాలో 143 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు
ములుగు రూరల్: వానాకాలం వరిధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో సాగు చేసిన వరి విస్తీర్ణానికి అనుకూలంగా దిగుబడి అంచనా వేశారు. ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రంగ సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ అధికారులు, కొనుగోళ్ల కేంద్రాల నిర్వాహకులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేపట్టనున్నారు. ధాన్యం సేకరణకు అవసరమయ్యే యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచారు. నిబంధనల మేరకు ధాన్యం మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు, వ్యవసాయ అధికారులకు సూచనలు అందించారు.
జిల్లాలో 1.07లక్షల ఎకరాల్లో వరిసాగు
జిల్లాలోని పది మండలాల పరిధిలో 1.07లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎకరాకు 22 క్వింటాల దిగుబడి అంచనా వేస్తున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా వరి దిగుబడి 2.35 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి అంచనా. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా 85 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఈ ఏడాది వరి సాగు జిల్లాలో కొంతమేర తగ్గగా సన్నధాన్యానికి బయట మార్కెట్‌లో ఎక్కువ ధర పలికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సన్నధాన్యం తక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు కొనుగోళ్లపై అంచనా తగ్గించారు.
జలసిరి పనులు
వేగవంతం చేయండి
చిట్యాల: మండలంలోని వివిధ గ్రామాలలో జరుగుతున్న వీబీజీ రామ్ జీ జలసిరి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని డీఆర్‌డీఓ బాలకృష్ణ అన్నారు. గురువారం జూకల్ గ్రామంలోని రైతుల వ్యవసాయ క్షేత్రంలో తవ్విన పంట కుంటలు, కమ్యూనిటీ సోక్‌పిట్స్ పనులను పరిశీలించారు. పంట కుంటలతో కలిగే లాభాలు, నీటి నిల్వ సామర్ధ్యం గురించి రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ హలీమ్‌పాషా, ఈసీ సుధాకర్, స్రవంతి, సిబ్బంది చిరంజీవి, నవీన్, మారి సంస్థ ప్రతినిధులు, ఐకేపీ సీసీలు పాల్గొన్నారు.
10 మండలాలు..143 కేంద్రాలు
లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు జిల్లా వ్యాప్తంగా 143 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు, గిరిజన సహకార సంఘాలు, కేవీ, ఎఫ్‌పీఓల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా సంఘాలకు కేంద్రాలను కేటా యించారు. అలాగే ధాన్యం సేకరణకు 30 లక్షల గన్నీబ్యాగులు అవసరం ఉన్నాయి. దీంట్లో 20.10లక్షల గన్నీబ్యాగుల అందుబాటులో ఉ న్నట్లు అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తూర్పాల పట్టే యంత్రాలు, తేమశాతం నిర్ధేశించే పరికరాలు, ఎలక్ట్రానిక్ కాంటాలతో పాటు టార్పాలిన్లు సిద్ధం చేస్తున్నారు.
రైతులను నిండాముంచిన సిద్ది 44 సన్నరకం విత్తనాలు
110 రోజులైనా పొట్టదశకు రాని వరి
1500 ఎకరాలకు పైగా సాగు
కలెక్టర్‌కు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన వ్యవసాయ శాస్త్రవేత్తలు
ఎకరాకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని రైతుల డిమాండ్
85 వేల మెట్రిక్ టన్నుల
ధాన్యం సేకరణ లక్ష్యం
అందుబాటులో గన్నీబ్యాగులు


