గ్రామాల అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధికి కృషి

Oct 30 2026 2:15 AM | Updated on Oct 30 2026 2:15 AM

వెంకటాపురం(ఎం): గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించి మౌలిక సదుపాయాల కల్పనకు అన్ని విధాలా కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్‌) నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి గురువారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైర్మన్‌ శ్రీనివాస్‌తో పాటు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో రూ. 99లక్షల అంచనా వ్యయంతో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. గతంలో కాలనీలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనులను మంజూరు చేసినట్లు తెలిపారు. స్థానిక సర్పంచ్‌, నాయకుల సూచనలు, సలహాలు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆశించిన మేర వర్షాలు కురవని నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

విద్యార్థులు ఆసక్తిగా చదవాలి

గోవిందరావుపేట: విద్యార్థులు ఆసక్తితో చదివి ఉన్నతంగా ఎదగాలని మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని పస్రా జెడ్పీహెచ్‌ఎస్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌లో భాగంగా గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని పలు సూచనలు చేశారు. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకుంటూ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలన్నారు. మాట్లాడే బొమ్మ ద్వారా గుడ్‌ టచ్‌– బ్యాడ్‌ టచ్‌ గురించి వివరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రవిచందర్‌, డీడబూల్యో ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement