విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలి

Oct 29 2026 1:18 AM | Updated on Oct 29 2026 1:18 AM

ములుగు: విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలని కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు సూచించారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన నశాముక్త్‌ భారత్‌ అవగాహన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌ నుంచి గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా బుధవారం వర్చువల్‌ విధానంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ మత్తుపదార్థాల నివారణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ విద్యార్థులతో కలిసి గవర్నర్‌ సందేశాన్ని వీక్షించారు. అనంతరం కలెక్టర్‌ నశాముక్త్‌ భారత్‌ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడుతూ పాఠశాల దశ నుంచే విద్యార్థులు మంచి అలవాట్లను పెంపొందించుకుని బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు. చెడు వ్యసనాలకు ‘నో’ చెబుతూ, క్రీడల్లో రాణిస్తూ సన్మార్గంలో పయనించాలని కలెక్టర్‌ పిలు పునిచ్చారు. విద్యార్థులు చదువుకు ప్రాధాన్యం ఇస్తూనే ప్రతిరోజూ క్రీడలు, శారీరక శ్రమకు సమయం కేటాయించాలని సూచించారు. క్రికెట్‌, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌ వంటి తమకు ఇష్టమైన క్రీడల్లో పాల్గొనాలన్నారు. పౌష్టికాహారం, నిత్య వ్యాయామం, తగిన నిద్రను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ అల్లం అప్పయ్య, వైస్‌ చైర్మన్‌ గంగిశెట్టి శ్రీనివాస్‌, సెక్రటరీ రాజిరెడ్డి, కోశాధికారి శిరుప సతీశ్‌కుమార్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement