వృత్తి విద్యతో ఉపాధి | - | Sakshi
Sakshi News home page

వృత్తి విద్యతో ఉపాధి

Oct 29 2026 1:18 AM | Updated on Oct 29 2026 1:18 AM

● జిల్లా విద్యాశాఖ ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరెడ్డి

గోవిందరావుపేట: పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్యపై అవగాహన కల్పిస్తే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దవచ్చని జిల్లా విద్యాశాఖ ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల పరిధిలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ చల్వాయిలో సమగ్ర శిక్ష తెలంగాణ, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల ఫ్రీ వొకేషనల్‌ కౌశల్‌ బోధ శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా శిక్షణకు హాజరైన ఉపాధ్యాయులకు ఆయన సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన కౌశల్‌ బోధ కార్యక్రమం ద్వారా 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సైతం వృత్తి విద్యను పరిచయం చేయడంపై శిక్షణ ఇచ్చారు. సంప్రదాయ విద్యతో పాటు వివిధ వృత్తులపై అవగాహన పెంపొందించి, భవిష్యత్తులో స్వయం ఉపాది అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. చల్వాయి మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ గండు కుమార్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తూ మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో ఫ్రీ వొకేషనల్‌ విద్యకు ఎంపికై న 16 పాఠశాలలకు చెందిన సుమారు 75 మంది ఉపాధ్యాయులు శిక్షణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్‌ పర్సన్లు హారిక, పావని, అంజని, శశిధర్‌, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement