బెటాలియన్‌లో రక్తదాన శిబిరం | - | Sakshi
Sakshi News home page

బెటాలియన్‌లో రక్తదాన శిబిరం

Oct 29 2026 1:18 AM | Updated on Oct 29 2026 1:18 AM

గోవిందరావుపేట: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని చల్వాయిలో గల 5వ బెటాలియన్‌ టీజీఎస్పీలో కమాండెంట్‌ సీవీ. లక్ష్మీకాంతరావు నాయకత్వంలో రక్తదాన శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సుమారు 50 మంది పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. ములుగు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.చంద్రశేఖర్‌ సూచనల మేరకు ఆర్‌ఎంఓ, బ్లడ్‌ బ్యాంక్‌ బాధ్యులు డాక్టర్‌ పి.అనూష ఆధ్వర్యంలో శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ పోలీసు శాఖ ప్రజల రక్షణ, భద్రతకు కృషి చేస్తుండగా వైద్యశాఖ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అంకితమై పని చేస్తోందన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా పని చేసే ఈ రెండు శాఖల సమన్వయం అభినందనీయమని వెల్లడించారు. అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడటమే వారికి మనం అందించే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ కమాండెంట్‌ ధర్మారావు, ఆర్‌ఐలు సాయిబాబు, వెంకటేశ్వర్లు, భాస్కర్‌, ఆర్‌ఎస్సైలు, బెటాలియన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

50 మంది పోలీసులు రక్తదానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement