మంగపేట: అన్నదాతలను అర్నబ్ తుపాన్ కలవర పెడుతోంది. తుపాన్ కారణంగా మండలంలో మంగళవారం రాత్రి నుంచి తేలికపాటి గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం పడుతోంది. దీంతో తేలికపాటి గాలివానతో తిమ్మంపేట, వాడగూడెం, చుంచుపల్లి, నర్సింహసాగర్ తదితర గ్రామాల్లో వరి పైరు నేలవాలింది. ఈ వర్షంతో పంటలకు ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరగలేదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మిర్చి, మినుము లాంటి తదితర పంటలకు ఈ వర్షం కొంతమేలు చేసిందని రైతులు చెబుతున్నారు. భారీగా ఈదులు గాలులు వీస్తే కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట, ఏపుగా పెరిగిన మిర్చి మొక్కలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.


