68 శాతం పూర్తి | - | Sakshi
Sakshi News home page

68 శాతం పూర్తి

Oct 27 2026 12:56 AM | Updated on Oct 27 2026 12:56 AM

ములుగు రూరల్‌: ప్రభుత్వం రైతులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతో పాటు వ్యవసాయ భూమి, సాగు చేస్తున్న పంటలు వివరాలను తెలుసుకునే విధంగా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని రైతుల వివరాలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. రైతులు పంటల సాగుకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు, అమ్మకం సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలకు వీలుగా ఉండడంతో పాటు ప్రభుత్వ పథకాల అమలు, ప్రకృతి వైపరిత్యాల సమయంలో పంటల నష్టం జరిగిన రైతులను గుర్తించి పరిహారం అందించేందుకు అనుగుణంగా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేపడుతున్నారు.

54,237 మంది రైతుల రిజిస్ట్రేషన్‌ పూర్తి

జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 80,103 మంది రైతులు ఉండగా ఇందులో 54,237 మంది రైతుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి అయింది. 25,866 మంది రైతుల ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో 68 శాతం ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తి అయింది. గ్రామాల్లో రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారులు దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రిజిస్ట్రేషన్‌తో ప్రయోజనాలు

రైతులకు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌తో రైతుబంధు, రైతుబీమా, విత్తనాలు, ఎరువులు, అమ్మకం సమయంలో టోకెన్‌లు జారీ ప్రక్రియ వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. పంటల అమ్మకాలకు రైతులకు సులువుగా ఉంటుంది. రైతు నమోదు చేసుకున్న భూమి విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువుల పంపిణీ, విత్తనాలు సరఫరా, పంట నష్ట పరిహారం చెల్లించే క్రమంలో అవకతవకలు జరగకుండా నేరుగా రైతులకు అందించడానికి వీలుగా ఉంటుంది. దీంతో పాటు పంట రుణాలు, మాఫీ ప్రక్రియతో రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారు 54,237

చేసుకోనివారు 25,866

మొత్తం రైతులు 80,103

జిల్లాలో ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌కు స్పందన

54,237 రైతులు ప్రక్రియ పూర్తి

ముమ్మరంగా అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement