ములుగు రూరల్: వరంగల్,ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని జిల్లా అధ్యక్షుడు బలరాం అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ పట్టభద్రుల మద్దతును కూడగట్టాలన్నారు. గ్రామాల్లో పట్టభద్రుల ఓటరుగా నమోదుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూక్య జవహా ర్‌లాల్, రవింద్రాచారి, నగరపు రమేష్, రాజు కుమార్, నాగరాజు, ఇమ్మడి రాకేష్ యాదవ్, సుధాకర్‌రెడ్డి, మహేందర్, నాగేశ్వర్‌రావు, అని ల్, ప్రవీణ్, రవి తదితరులు పాల్గొన్నారు.
హేమాచలుడిని
దర్శించుకున్న సీసీఎఫ్
మంగపేట: మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని అటవీశాఖ కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్ సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు దేవాదాయశాఖ అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఏడునూతుల ఈశ్వర్‌చంద్ రామాజనుజదాస్ సీసీఎఫ్ కు టుంబ సభ్యుల గోత్ర నామాలతో స్వామివా రికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి శేష వస్త్రాలను బహూకరించారు. వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆయన వెంట ఇన్‌చార్జ్ రేంజ్ ఆఫీసర్ లాయక్ హుస్సేన్, సిబ్బంది ఉన్నారు.
కోజాగరి పౌర్ణమి
ప్రత్యేక పూజలు
కాళేశ్వరం: శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆది ముక్తీశ్వర స్వామి ఆలయం(బాలాలయం)లో కోజాగరి పౌర్ణమి సందర్భంగా ఆదివారం రాత్రి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప ప్రధాన అర్చకుడు ఫణింద్రశర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించగా, రాత్రి 10 గంటలకు భజనలు, 11,30 గంటల నుంచి కౌముది పూజ నిర్వహించారు. అనంతరం భక్తులు పాలలో చంద్రుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్‌రెడ్డి, ధర్మకర్త గంధేసిరి సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ ఉమామహేశ్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: ఉమ్మడి జిల్లా పరీక్షల విభాగం కార్యదర్శి నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి లలిత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల నుంచి ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.


