పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలి

Oct 27 2026 12:56 AM | Updated on Oct 27 2026 12:56 AM

మంగపేట: వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన రాంరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ డైరెక్టర్‌ వసంత శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన పార్టీ ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నవంబర్‌ 6 వరకు పట్టభద్రుల ఓటు నమోదు గడువు ఉన్నందున గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు అర్హులైన పట్టభద్రులు అందరూ ఓటు హక్కు నమోదు చేయించేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విజయమే ధ్యేయంగా యువజన కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు అయ్యోరి యానయ్య, మండల నాయకులు మురుకుట్ల నరేందర్‌, ఎడ్ల నరేష్‌, భానుచంధర్‌, కుర్సం రమేష్‌, మణివర్మ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ డైరెక్టర్‌ వసంత శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement