ములుగు: ఎస్‌ఐఆర్ 2026 ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సు దర్శన్‌రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో స మీక్షించారు. ములుగు సమీకృత కలెక్టరేట్ కార్యాల య వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన అన్ని నోటీసులపై ప్రక్రియను వచ్చే వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫారం–6, 7, 8 దరఖాస్తులను నవంబర్ 5లోగా పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కృష్ణవేణి, ఎన్నికల సెక్షన్ సిబ్బంది సలీం, నితీష్, అధికారులు పాల్గొన్నారు.
వాల్మీకి ఆశయాలను ఆదర్శంగా
తీసుకోవాలి: కలెక్టర్
మహర్షి వాల్మీకి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సత్యం, ధర్మం, నైతిక విలువలను ప్రతిఒక్కరూ ఆచరించాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనాతో కలిసి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామాయణ మహాకావ్యం ద్వారా సత్యం, ధర్మం, మానవీయ విలువలను చాటిన మహనీయుడు వాల్మీకి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సీహెచ్. మహేందర్ జి, సంపత్ రావు, జిల్లా రెవెన్యూ అధికారి రవి కుమార్, జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి రామ్మోహన్, వాల్మీకి కుల సంఘం సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
సుదర్శన్ రెడ్డి


