విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి

Oct 27 2026 12:56 AM | Updated on Oct 27 2026 12:56 AM

● డీఈ పురుషోత్తం

ఏటూరునాగారం: మండలంలోని శంకరాజుపల్లి, ముళ్లకట్ట గ్రామాల్లో ఎదురౌతున్న విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డీఈ పురుషోత్తం తెలిపారు. సోమవారం విద్యుత్‌ ఓవర్‌లోడ్‌, లో వోల్టేజీ సమస్యల పరిష్కారానికి అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఈ భిక్షపతి ఆదేశాల మేరకు నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యమన్నారు. శంకరాజుపల్లిలో రెండు 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు, ఒకటి 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌, ముళ్లకట్టలో 25 కేవీ, 63 కేవీల కెపాసిటీ ఉన్న ట్రాన్స్‌పార్మర్‌లను ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా రైతులకు నిరంతరం విద్యుత్‌ సరఫరా ఉంటుందన్నారు. ఏడీఈ ఉమారావు, ఏఈ పండ్ల శేఖర్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ సుజిత్‌, లైన్‌మెన్‌ రాజేష్‌, అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ హరీష్‌, రమేష్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement