3, 4 తేదీల్లో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు | - | Sakshi
Sakshi News home page

3, 4 తేదీల్లో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు

Oct 26 2026 2:16 AM | Updated on Oct 26 2026 2:16 AM

హన్మకొండ కల్చరల్‌: వచ్చే నెల 3, 4 తేదీల్లో సాయంత్రం వరంగల్‌లోని భద్రకాళి దేవాలయం దగ్గరలోని కీర్తిగార్డెన్స్‌లో విద్యారణ్య ఆర్ష ధర్మ రక్షణ సంస్థ వరంగల్‌ ఆధ్వర్యంలో ధార్మికవేత్త, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు వరంగల్‌ రాంకీ ఎన్‌క్లేవ్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన సమావేశంలో నిర్వాహకులు ప్రకటించారు. మాతాపితృ భక్తి, ధర్మశ్రద్ధ, రుజువర్తనం, పాపభీతి, దైవభక్తి తదితర అంశాలపై ప్రవచనాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో వ్యాపారవేత్తలు తోట జగన్నాథం, బజ్జూరి వైకుంఠం, నంబూరు విశ్వేశ్వరరావు, ఆకారపు శశిధర్‌, హరీష్‌, తాటికొండ కేదారి ప్రభాకర్‌, డాక్టర్‌ పోలా నటరాజ్‌, చింతలపాణి వరుణ్‌రెడ్డి, కర్ర రాజిరెడ్డి, భద్రకాళి దేవాలయం ప్రధానార్చకులు భద్రకాళి శేషు, తోట శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement