రాజుకు జాతీయ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

రాజుకు జాతీయ పురస్కారం

Oct 26 2026 2:16 AM | Updated on Oct 26 2026 2:16 AM

కాళేశ్వరం: మహదేవపూర్‌కు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ పంతకాని రాజుకు తెలంగాణ ఫొటోగ్రఫీ అకాడమీ జాతీయ పురస్కారం లభించింది. హైదరాబాద్‌ మాదాపూర్‌ స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో నిర్వహించిన శ్రీప్రొజెన్‌ ఇన్‌ టైమ్‌శ్రీ పుస్తకావిష్కరణ, కాకతీయ వారసత్వ చిత్రాల ప్రదర్శన, పురస్కార ప్రదానోత్సవంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. జాతీయ ఫొటోగ్రఫీ సదస్సు 2019లో చిత్రీకరించిన అద్భుతమైన ఛాయాచిత్రాలతో శ్రీప్రొజెన్‌ ఇన్‌ టైమ్‌ ఎ ఫొటోగ్రాఫిక్‌ ఓడ్‌ టు కాకతీయ హెరిటేజ్‌శ్రీ పుస్తకాన్ని రూపొందించారు. 2024–2026 మధ్య నిర్వహించిన పోటీల నుంచి ఎంపిక చేసిన 127 ఉత్తమ చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫైన్‌ ఆర్ట్‌ గ్యాలరీ ప్రదర్శనలో పంతకాని రాజు ట్రైబల్‌, ఒడిశా బోండా ట్రైబ్‌ రెండు చిత్రాలకు చోటు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement