మండలాల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలు
ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్ల పథకంపై స్పష్టత కరువు
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అర్హుల గుర్తింపు
ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్ల పంపిణీ పథకాన్ని ప్రవేశపె ట్టింది. దరఖాస్తుల స్వీకరణ గడువు సైతం సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసింది. ఈ మేరకు జిల్లాలోని 10 మండలాల పరిధిలో 3,792 మంది మహిళలు కుట్టుమిషన్ల కోసం దరఖాస్తులు అందజేశారు. నియోజకవర్గానికి వెయ్యి టార్గెట్ అంటూ ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు పథకం అమలుపై స్పష్టత రాలేదు. బీసీ కుటుంబాల్లోని కుట్టుపనిపై ఆధారపడి జీవనోపాధి పొందాలనుకునే మహిళలకు కుట్టుమిషన్లు అందించే పథకం అమలు, అర్హుల ఎంపిక, పంపిణీ ప్రక్రియపై స్పష్టత రాకపోవడంతో దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. అసలు కుట్టుమిషన్లు అందుతాయా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సరైన విఽధి విధానాలు రాకపోవడంతో అధికారులు, లబ్ధిదారులు తర్జనభర్జన పడుతున్నారు.
జాప్యం తగదు..
మహిళలకు స్వయం ఉపాధి కల్పించే కుట్టుమిషన్ల పంపిణీ పథకంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరి కాదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మ హిళలకు కుట్టుమిషన్లు అందించడంతో పాటు అవసరమైన శిక్షణ, ఆర్థిక సహాయం, మార్కెటింగ్ అవకాశాలు కల్పించినప్పుడే ప్రయోజనం చేకూరుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం తక్షణమే స్పందించి కుట్టు మిషన్లు అందించాలి.
మండలం దరఖాస్తులు
ఏటూరునాగారం 355
గోవిందరావుపేట 302
కన్నాయిగూడెం 145
మల్లంపల్లి 288
మంగపేట 456
ములుగు 506
ములుగు మున్సిపాలిటీ 367
ఎస్‌ఎస్‌తాడ్వాయి 169
వెంకటాపురం(కె) 364
వెంకటాపురం(ఎం) 589
వాజేడు 251
అర్హుల ఎంపిక, పంపిణీపై జాప్యం
జిల్లా వ్యాప్తంగా 3,792 దరఖాస్తులు
ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులు
ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం కింద 3,792 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం నుంచి విధివిధానాలు రాగానే కార్యాచరణ చేపడుతాం. అప్పటి వరకు వేచి చూడాలి. మండల కమిటీలు కూడా ఉంటాయి. అందులో అర్హులైన వారిని గుర్తించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాల అందిన వెంటనే ఆ పథకం అమలుకు చర్యలు చేపడుతాం.
– రామ్మోహన్, బీసీ సంక్షేమశాఖ అధికారి


