ఈసారి ఎండు గడ్డి ధరలు మండిపోతున్నాయి. నాకు నాలుగు గేదెలున్నాయి. గత నెల వరకు పొద్దున 15 లీటర్లు, సాయంత్రం 15 లీటర్లు వరకు పాలు ఇచ్చేవి. ఇప్పుడు ఎండలు ముదిరిపోయాయి. ఎల్‌నినో ప్రభావమో ఏమో కానీ, చలికాలంలో కూడా ఎండలు అధికంగానే ఉన్నాయి. ఈ వేడికి గేదెలు సరిగా మేత మేయడం లేదు. పాల దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. ఎండుగడ్డి దొరుకుతలేదు. ప్రభుత్వం స్పందించి గడ్డిని తక్కువ ధరకు అందించి, మాలాంటి రైతులను ఆదుకోవాలి.
– ఎల్లావుల మల్లేశ్‌యాదవ్, పాడి రైతు,
పస్రా, గోవిందరావుపేట మండలం


