భక్తులతో కిక్కిరిసిన హేమాచలక్షేత్రం | - | Sakshi
Sakshi News home page

భక్తులతో కిక్కిరిసిన హేమాచలక్షేత్రం

Oct 26 2026 2:16 AM | Updated on Oct 26 2026 2:16 AM

మంగపేట : మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 5వేల మందికి పైగా భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణ మంతా భక్త జనసందడితో జాతరను తలపించింది. పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో స్వయంభు స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు ముక్కామల రాజశేఖర్‌శర్మ, అనిపెద్ది రాజీవ్‌శర్మ, కారంపుడి పవన్‌కుమార్‌ ఆచార్యులు, వెంకటనారాయణ శర్మ ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించిన తిలతైలాభిషేకం పూజలో పాల్గొని స్వామివారికి నువ్వుల నూనె, పూల దండలు, పట్టు వస్త్రాలను సమర్పించారు. మానవ శరీరాన్ని పోలి ఉన్న స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. పూజారులు స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం భక్తులకు వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. అలాగే లక్ష్మీనర్సింహస్వామిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన వారికి దేవాదాయశాఖ అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. డీఆర్‌ఓ దంపతుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి శేష వస్త్రాలను బహుకరించి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి వెంట జీపీఓ రాములు. నర్సయ్య ఉన్నారు.

స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు

పంచముఖాంజనేయస్వామి ఆలయం వద్ద

భక్తులకు ఆశీర్వచనం ఇస్తున్న పూజారి

జాతరను తలపించిన ఆలయ

ప్రాంగణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement