ఎస్‌ఎస్‌తాడ్వాయి: సేవంకుర్ భారత్, వనవాసి కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో దేశానికి మూడు రోజుల సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం కొండపర్తిలో వైద్యశిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏటూరునాగారం ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్ హాజరయ్యారు. జిల్లాలో అమలవుతున్న ఎల్‌సీడీసీ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఆరోగ్యంపై ఆయన అవగాహన కల్పించారు. అనంతరం ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించి పాల్గొన్న వైద్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. గిరిజనులకు వైద్య సేవలందించిన వైద్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మూర్తి, శరత్, రిటైర్డ్ డీపీఎంఓ సంజీవరావు, హెచ్‌వీ ఉష, ఏఎన్‌ఎంలు మంగ, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. అదే విధంగా అంకంపల్లిలో సేవా భారతి ఆస్పత్రి, వనవాసి కల్యాణ పరిషత్, సేవంకూర్ భారత్ సంస్థల సహకారంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఉపసర్పంచి విజయకాంత్, పంచాయతీ కార్యదర్శి రోజా, బండారి జగదీశ్, ఇర్ప నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


