అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

Oct 26 2026 2:16 AM | Updated on Oct 26 2026 2:16 AM

ఏటూరునాగారం: రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ(ఆర్టీఏ) డైరెక్టర్‌ వసంత శ్రీనివాస్‌ యాదవ్‌ సూచించారు. ఈ మేరకు ఆయన మండల కేంద్రంలోని ఐటీడీఏ గిరిజన భవనంలో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులను ఆయన కలిసి ఆదివారం మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకునేందుకు నవంబర్‌ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోలీసు ఉద్యోగాల కోసం కష్టపడి శిక్షణ పొందుతున్న అభ్యర్థుల్లో ఇప్పటివరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వారికి తన సొంత ఖర్చులతో పది మంది అభ్యర్థులకు ఉచితంగా డ్రైవింగ్‌ ఇప్పిస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో రామన్నగూడెం సర్పంచ్‌ గద్దల నవీన్‌, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మధు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement