పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ

Oct 25 2026 1:05 AM | Updated on Oct 25 2026 1:05 AM

ఏటూరునాగారం: మండల పరిధిలోని చల్పాక పీహెచ్‌సీని ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రగ్‌ స్టోర్‌ రూమ్‌ను తనిఖీ చేసి మందుల నిల్వలపై ఆరా తీశారు. జనరల్‌ ఫార్మసీ, ఆయుష్‌ ఫార్మసీల్లో మందుల లభ్యతను, రోగులకు మందుల పంపిణీపై అడిగి తెలుసుకున్నారు. వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో దోమల నివారణకు చేపడుతున్న వివరాలను తెలుసుకున్నారు. రోగుల వివరాల నమోదు రిజిస్టర్‌ను పరిశీలించారు. అలాగే మందుల నిల్వలు, పంపిణీ, రికార్డుల నిర్వహణ, ఆస్పత్రి పరిసరాల పరిశుభ్రతపై నిరంతరం దృష్టి సారించాలని పీఓ వైద్య సిబ్బందికి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement