మొట్లగూడెం అడవిలో చిరుత సంచారం? | - | Sakshi
Sakshi News home page

మొట్లగూడెం అడవిలో చిరుత సంచారం?

Oct 25 2026 1:05 AM | Updated on Oct 25 2026 1:05 AM

● భయాందోళనలో పరిసర గ్రామాల ప్రజలు

మంగపేట : మండలంలోని కొత్తూరు–మొట్లగూడెం పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుందని రెండు రోజులుగా ప్రచారం జరుగుతుండటంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కోమటిపల్లి గ్రామానికి చెందిన పాలకొండ వెంకన్న తన మేకలు, గొర్ల మందను తోలుకుని రెండు రోజుల క్రితం తొండ్యాలలక్ష్మీపురం అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా గొర్ల మంద బెదరడంతో అటువైపు చూడగా చిరుత పులి గొర్రెపిల్లను ఎత్తుకుని అడవిలోకి పారిపోయిందని తెలిపారు. అలాగే గ్రామానికి చెందిన నాగెల్లి మల్లయ్య, బండారి భిక్షం, పున్నెపుర్తి రమేశ్‌లకు సైతం పులి కనిపించిందని వివరించారు. ఈ విషయాన్ని వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వచ్చిన అధికారులకు ఆ ప్రాంతాన్ని సైతం చూపించామని తెలిపారు. ఈ విషయంపై తొండ్యాలలక్ష్మీపురం, అటవి ప్రాంతం, నర్సాయిగూడెం, సూరాపెల్లి అడవిలో పులి సంచరిస్తుందని రైతులు, పశువులు, మేకలు, గొర్ల కాపర్లు అడవిలోకి వెళ్లవద్దని, పంట పొలాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని కోమటిపల్లి గ్రామం వాట్సాప్‌ గ్రూప్‌లో అటవీశాఖ అధికారులు పోస్టు చేయడంతో ఆయా గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ విషయంపై కోమటిపల్లి బీటాఫీసర్‌ ప్రశాంత్‌ను వివరణ కోరగా గొర్రెల కాపరి చెప్పిన ప్రాంతం తమ పరిధిలోని రాదని ఏటూరునాగారం సౌత్‌ జోన్‌ పరిధిలోకి వస్తుందని తెలిపారు. చిరుత ఆచూకీ కోసం ఆనవాళ్లను సేకరిస్తున్నామని వివరించారు. ఏటూరునాగారం సౌత్‌ జోన్‌ బీటాఫీర్‌ జరుపుల పవన్‌ను అడుగగా గొర్రెను లాక్కువెళ్లిన ప్రాంతాన్ని తాము పరిశీలించగా ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని వివరించారు. ఈ విషయంపై జిల్లా అటవీశాఖ అధికారి స్పందించి పులి సంచారంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి ప్రజల ఆందోళన తొలిగిపోయేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement