సకాలంలో వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

సకాలంలో వైద్యం అందించాలి

Oct 25 2026 1:05 AM | Updated on Oct 25 2026 1:05 AM

● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

సంజయ్‌ జాజు

ములుగు: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్‌ అవర్‌లో వైద్యచికిత్స అందించి ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్‌ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు రోడ్డు ప్రమాద బాధితుల చికిత్స పథకం–2025 కింద పీఎం రాహత్‌ పథకం అమలు పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీసీకి జిల్లా నుంచి కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌తో కలిసి హాజరయ్యారు. పీఎం రాహత్‌ పథకం అమలు విధానం, ఆసుపత్రుల్లో బాధితులకు వైద్య సేవలు అందించే ప్రమాద వివరాల నమోదుతో పాటు తదితర అంశాలను అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ పథకం ద్వారా అర్హులైన రోడ్డు ప్రమాద బాధితులకు ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల వరకు చికిత్స ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement