● జిల్లాలో ముమ్మరంగా నీటి సంరక్షణ చర్యలు ● వీబీజీరామ్‌జీ పథకంలో నిర్మాణాలు | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో ముమ్మరంగా నీటి సంరక్షణ చర్యలు ● వీబీజీరామ్‌జీ పథకంలో నిర్మాణాలు

Oct 24 2026 9:14 AM | Updated on Oct 24 2026 9:14 AM

వెంకటాపురం(కె): ఎల్‌నినో ప్రభావం వచ్చే ఏడాది జూలై వరకు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో అధిక ఉష్ణోగ్రతల కారణంగా సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులను అధికమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీబీజీరామ్‌జీ పథకంలో నీటి సంరక్షణ పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నీటి కుంటలు, ఇంకుడు గుంతలు, పెర్కొలేషన్‌ ట్యాంకులు, బోర్‌వెల్‌ రీచార్జ్‌ పనులు చేపట్టారు.

కూలీలకు ‘ఉపాధి’

జిల్లాలోని పది మండలాల్లోని 171 గ్రామ పంచాయతీల్లో ఈ పథకాన్ని అధికారులు అమలు చేస్తున్నారు. మొత్తం 82,151 జాబ్‌ కార్డులు ఉండగా 1,60,847 మంది కూలీలు నమోదై ఉన్నారు. వీటిలో 51,000 జాబ్‌ కార్డులు క్రీయాశీలకంగా ఉన్నాయి. వీటిలో 87,000 మంది కూలీలు లబ్ధిపొందుతున్నారు.

నీటి సంరక్షణపై దృష్టి

భవిష్యత్‌లో ఎల్‌నినో వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటిని అధికమించేందుకు ప్రభుత్వం ప్ర త్యేక దృష్టి సారించింది. ఇందుకు గాను నీటి సంరక్షణ ద్వారా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందు కు ఉపాధి హామీ పథకం కింద నీటి సంరక్షణ పనులను పెద్దఎత్తున చేపట్టేందుకు చర్యలు చేపట్టింది.

ముంచుకొస్తున్న ఎల్‌నినో ముప్పును అధిక మించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మక చర్యలు వేగవంతం చేసింది. నీటి ఎద్దడిని తట్టుకునేలా జిల్లావ్యాప్తంగా ఉపాధి కూలీల సహకారంతో నీటి

సంరక్షణ చర్యలు చేపట్టింది.

జలసిరి లక్ష్యం

జిల్లాలో ఫాంపాండ్లు 880, నీటి కుంటలు 150, వ్యక్తిగత ఇంకుడు గుంతలు 30,000, సామూహిక ఇంకుడు గుంతలు 150, బోర్‌వెల్‌ రీచార్జ్‌ పనులు 150, ఓపెన్‌ వెల్‌ నిర్మాణ పనులు 10, చెక్‌డ్యామ్‌లు 256 పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఇప్పటి వరకు పాంపాండ్లు 100, నీటి కుంటలు 43, ఇంకుడు గుంతలు 518, సామాజిక సోప్‌ కిట్లు 69, పెర్కొలేషన్‌ ట్యాంక్‌లు 37, చెక్‌ డ్యామ్‌లు 18 నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement