పోలీస్‌ అమరులకు నివాళి | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ అమరులకు నివాళి

Oct 24 2026 9:14 AM | Updated on Oct 24 2026 9:14 AM

ములుగు రూరల్‌: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ సుధీర్‌ రా మ్నాథ్‌ కేకన్‌ ఆదేశాల మేరకు అడిషనల్‌ ఎస్పీ సదా నందం ఆధ్వర్యంలో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ములుగు బస్టాండ్‌ జంక్షన్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఏరియా హాస్పిటల్‌ జంక్షన్‌ వ రకు కొనసాగింది. అనంతరం అమరవీరుల ఫ్లెక్సీ వద్ద పోలీస్‌ అధికారులు, సిబ్బంది నివాళులర్పించారు. దేశ భద్రత, ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అందిస్తున్న సేవలను, విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రజలకు తెలియజేయడంతో పాటు, దేశం కోసం ప్రాణత్యా గం చేసిన అమరవీరుల సాహసం, అంకితభావాన్ని స్మరించుకోవడం ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని అడిషనల్‌ ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్‌, ఆర్‌ఐ స్వామి, శ్రీకాంత్‌, తిరుపతి, ఎస్‌హెచ్‌ఓ వెంకటేష్‌, ఎస్సైలు చంద్రశేఖర్‌, రచిత్ర, సాయికృష్ణ, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement