● అదనపు కలెక్టర్ సంపత్ రావు
ములుగు: జనగణన–27లో భాగంగా గణన బ్లాకులు, ఉప గణన బ్లాకులను పటిష్టంగా ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్‌రావు సూచించారు. ములుగు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జనగణన–2027 రెండవ దశకు సంబంధించి రెండు రోజుల శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జనాభా గణనలోని 40 ప్రశ్నలు, స్వీయ గణన, సీఎంఎంఎస్ పోర్టల్‌పై అవగాహన కల్పించారు. హైదరాబాద్‌లోని జనాభా గణన సంచాలకుల కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు యువేందర్ బాబు, నాయుడు రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సీహెచ్ మహేందర్, ఆర్డీఓ కృష్ణవేణి, ఛార్జ్ అధికారులు తహసీల్దార్లు, అదనపు ఛార్జ్ అధికారులు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ముఖ్య ప్రణాళిక అధికారి బి.జవహర్ లాల్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి, గణాంక అధికారులు భూక్యా లాల్ నాయక్, ఎం.రమేష్ బాబు, ఈడీఎం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.


