అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

Oct 24 2026 9:14 AM | Updated on Oct 24 2026 9:14 AM

● కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు

ములుగు: గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థా యి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్‌ వత్సల్‌ టొప్పో, జిల్లా అటవీ శాఖాధికారి వికాస్‌ మీనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో సోలార్‌ లైట్ల ఏర్పాటు, బోర్ల తవ్వకం, రహదారుల నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు అవసరమైన అటవీ శాఖ అనుమతులపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని, అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి అనుమతుల కోసం పూర్తి వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement