సీఎం పర్యటనకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు ఏర్పాట్లు

Feb 6 2026 11:52 AM | Updated on Feb 6 2026 11:52 AM

సీఎం పర్యటనకు ఏర్పాట్లు

సీఎం పర్యటనకు ఏర్పాట్లు

భూపాలపల్లి: ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, పొరపాట్లకు తావు ఇవ్వొద్దని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో సీఎం పర్యటనకు చేయాల్సిన ఏర్పాట్ల్లపై రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, వైద్య, విద్యుత్‌, అగ్నిమాపక, దేవాదాయ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, ఎస్పీ మాట్లాడుతూ.. సీఎం పర్యటన సందర్భంగా శాఖల వారీగా నిర్వర్తించాల్సిన విధులపై దిశానిర్దేశం చేశారు. హెలిప్యాడ్‌ వద్ద ఉన్న విద్యుత్‌ వైర్లను తొలగించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా విద్యుత్‌ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. చెల్పూరు జీపీ పరిధిలో జరిగే సభా ప్రాంగణం వద్ద మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని, చెల్పూరులో పబ్లిక్‌ మీటింగ్‌ జరిగే ప్రాంతంలో ఆయుష్‌ ఆస్పత్రిలో సేఫ్‌ హౌస్‌, మీటింగ్‌ ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. సీఎం కాన్వాయ్‌కు అవసరమైన వాహనాల ఏర్పాటు, సీఎం ప్రయాణానికి వినియోగించే వాహనాల ఫిట్‌నెస్‌ తనిఖీలు, అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించాలని ఆదేశించారు. కొడవటంచ ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని,వీఐపీల ప్రొటోకాల్‌, పురోహితులను నియమించాలన్నారు.

పొరపాట్లకు తావివ్వొద్దు

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ,

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement