దారి ఇలా.. వెళ్లేదెలా? | - | Sakshi
Sakshi News home page

దారి ఇలా.. వెళ్లేదెలా?

Feb 6 2026 11:52 AM | Updated on Feb 6 2026 11:52 AM

దారి

దారి ఇలా.. వెళ్లేదెలా?

దారి ఇలా.. వెళ్లేదెలా?

అభివృద్ధికి ఆమడ దూరంలో ఐలాపూర్‌ పరిసర ప్రాంతాలు

ఏటూరునాగారం: ప్రభుత్వాలు మారిన.. పాలకులు మారిన.. ఏళ్లు గడుస్తున్నా ఏజెన్సీలోని పలు గ్రామాలకు శాశ్వత రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా శాశ్వత రోడ్లు లేకపోవడం బాధాకరం. అడవి పోతుందనే అటవీశాఖ అధికారుల అడ్డంకులతో కీకారణ్యంలో ఉన్న పలు గ్రామాలకు నేటికీ రోడ్డు వేసే అదృష్టం కనబడుటలేదు.

జిల్లాలోని కన్నాయిగూడెం మండలంలోని పలు గ్రామాలతో పాటు ఐలాపూర్‌ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేక 39 ఏళ్లుగా గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఏటూరునాగారంలో పంచాయతీలో ఉన్న గ్రామం 1986లో అప్పటి దివంగత నందమూరి తారకరామారావు ఐలాపూర్‌లో గిరిజన సంక్షేమ పాఠశాల భవనాన్ని రూ.4.3 లక్షలతో మంజూరు చేశారు. అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశాలు ఇచ్చారు. ఇక అంతే ఆ గ్రామంలో కేవలం గిరిజనులు ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారు. కాని ఇప్పటి వరకు విద్యుత్‌, తాగునీరు, విద్య, వైద్యం అరకొరగా అందుతున్న పరిస్థితి ఉంది. ఈ మౌలిక వసతులు అందాలంటే ముఖ్యంగా రవాణా మార్గం ఎంతో కీలకమైంది. అలాంటి రోడ్డు మార్గం నేటికీ లేకపోవడం దారుణం. వర్షాకాలం వచ్చిందంటే రోడ్డంతా బురదమయంగా మారుతున్న పరిస్థితి.

రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు

అసంపూర్తిగా బ్రిడ్జి నిర్మాణ పనులు

అటవీశాఖ అడ్డంకులతో

ఏజెన్సీవాసులకు తప్పని తిప్పలు

దారి ఇలా.. వెళ్లేదెలా?
1
1/1

దారి ఇలా.. వెళ్లేదెలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement