గాయపడిన దుప్పి అధికారులకు అప్పగింత
ఏటూరునాగారం: ఏటూరునాగారం– మంగపేట మండలాల మధ్యలోని అటవి ప్రాంతం నుంచి ప్రధాన రోడ్డుపైకి వచ్చి గాయపడి ఉన్న దుప్పిని అటవీశాఖ అధికారులకు పలువురు బాటసారులు అప్పగించారు. గురువారం ఉదయం జీడివాగు సమీపంలో వాహనాలు వెళ్తుండగా గాయపడిన దుప్పి కనిపించింది. దీంతో కమలాపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు గడ్డి శ్రీనివాస్, వల్స శ్రీనివాస్, సృజన్, రాంబాబు మరికొంత మంది చూసి చలించారు. ఇదే క్రమంలో మరికొన్ని దుప్పులు కూడా రోడ్డు దాటుతుండగా లారీ ప్రమాదానికి గురికాకుండా కాపాడారు. గాయపడిన దుప్పిని ఏటూరునాగారం రేంజ్ కార్యాలయానికి తరలించి రామన్నగూడెం బీట్ అధికారి దయానంద్‌కు అప్పగించినట్లు వారు తెలిపారు. అటవీ జంతువులను కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారని అటవీశాఖ అధికారులు వారిని అభినందించారు.
నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
ములుగు రూరల్: కార్మికులకు, రైతులకు ఉరితాడుగా మారిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో యూనియన్ కార్యాలయం వద్ద సమ్మె పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని తెలిపారు. కార్మిక చట్టాలను కొనసాగించాలని ఈ నెల 12న దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో చేపట్టనున్న ప్రదర్శన, సమావేశానికి అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాలు, కొమురయ్య, సారయ్య, శ్రీనివాస్, శ్యామ్‌సుందర్, సదయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు సరస్వతినది
పుష్కరాలపై సమీక్ష
కాళేశ్వరం: మే 21 నుంచి జూన్ 1 వరకు జరుగు సరస్వతినది అంత్యపుష్కరాలపై ఉన్నతాధికారులతో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, రాష్ట్ర ధార్మిక సలహాదారు గోవిందహరి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించనున్నట్లు ఈవో మహేశ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్రాను. శుక్రవారం (నేడు) సమీక్షను ఉదయం 10:30గంటలకు కాళేశ్వరం దేవస్థానం ఈఓ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ సంకీర్త్‌తో పాటు జిల్లాస్థాయి అధికారులు హాజరుకానున్నారని తెలిసింది.
ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ
కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను హౌసింగ్ పీడీ లోకిలాల్, డీఈ శ్రీకాంత్ తనిఖీ చేశారు. గురువారం లబ్ధిదారులతో ఇందిరమ్మ ఇళ్లు సకాలంలో నిర్మించాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారులకు తెలుపాలన్నారు. సర్పంచ్ హసీనా బానో, ఏఈ సందీప్, పంచాయతీ కార్యదర్శి కల్పన, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
నిర్దేశిత లక్ష్యాలను
అధిగమించాలి
మల్హర్(కాటారం): ఆస్పత్రి సిబ్బంది నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ దేవేందర్ అన్నారు. గురువారం మండలంలోని కాటారం ప్రాథమిక ఆర్యోకేంద్రంలో కాటారం, అంబటిపల్లి పీహెచ్‌సీ డాక్టర్లు, ఎన్‌సీడీ నర్సింగ్ అధికారులకు, సూపర్‌వైజర్లకు ఎన్‌డీసీ ప్రోగ్రాంపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఎన్‌సీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి (డిప్యూటీ డీఎంహెచ్‌ఓ) డాక్టర్ దేవేందర్ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని పీహెచ్‌సీల పరిధిలో ఏళ్ల పైబడిన అందరికీ బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఆన్‌లైన్ చేయాలని సూచించారు.
గాయపడిన దుప్పి అధికారులకు అప్పగింత
గాయపడిన దుప్పి అధికారులకు అప్పగింత


