బాలకుమారస్వామికి మంత్రి సీతక్క పూజలు
ములుగు రూరల్: మండల పరిధిలోని అంకన్నగూడెం బాలకుమారస్వామి జాతరలో గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొని మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. అనంతరం ఆమె ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమ్మక్క సోదరుడిగా బాలకుమార స్వామిని కొలుస్తారని తెలిపారు. సమ్మక్కకు యుద్ధ సమయంలో అండగా బాలగోముడుగా నిలిచాడని వివరించారు. ఆయనను గండ్ర గొడ్డలి రూపంలో కొలుస్తారని వెల్లడించారు. అనంతరం ఆలయ మరమ్మతులకు ఎస్‌డీఎఫ్ నిధుల నుంచి రూ. 5 లక్షల కేటాయించి పనులను ప్రారంభించారు.


