మేడారం క్లీన్..
● జోరుగా
సాగుతున్న
పారిశుద్ధ్య పనులు
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారంలో పారిశుద్ధ్య పనులు జోరుగా సాగుతున్నాయి. సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా మేడారానికి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో వారు పడేసిన చెత్తా చెదారం పేరుకుపోయింది. దీనిని తొలగించేందుకు పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారు. జాతర సమయంలో, జాతర అనంతరం మేడారానికి వస్తున్న భక్తులకు ఎక్కడ కూడా అపరిశుభ్రత, చెత్తాచెదారం కనిపించకుండా తొలగిస్తున్నారు. మేడారంతో పాటు పరిసర ప్రాంతాల్లో సైతం ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. డీపీఓ వెంకయ్య సైతం దగ్గరుండి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తూ చెత్తాచెదారం తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు కావాల్సిన వసతులు కల్పిస్తూ మేడారాన్ని క్లీన్‌గా చేసి స్థానికులకు తిరిగి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.


