రిపబ్లిక్‌ డేకు ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

రిపబ్లిక్‌ డేకు ఏర్పాట్లు చేయాలి

Jan 24 2026 7:58 AM | Updated on Jan 24 2026 7:58 AM

రిపబ్

రిపబ్లిక్‌ డేకు ఏర్పాట్లు చేయాలి

రిపబ్లిక్‌ డేకు ఏర్పాట్లు చేయాలి మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ తూకంలో మోసం చేస్తే చర్యలు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలి

ములుగు: గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) సిహెచ్‌. మహేందర్‌ జీ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) సంపత్‌ రావుతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్‌లో నిర్వహించే గణతంత్ర వేడుకలకు అధికారులు సన్నద్ధం కావాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ గోపాలరావు, డీసీఎస్‌ఓ షా ఫైజల్‌ హుస్సేని, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ తుల రవి, డీసీఓ సర్దార్‌ సింగ్‌, అధికారులు పాల్గొన్నారు. అలాగే రంజాన్‌ మాసాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అదనపు కలెక్టర్లు మహేందర్‌ జీ, సంపత్‌రావు తెలిపారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం మతపెద్దలతో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ విజయభాస్కర్‌, ఫైర్‌ స్టేషన్‌ అధికారి నాగరాజు, పంచాయతీ అధికారి ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

ములుగు: ములుగు మున్సిపల్‌ కమిషనర్‌గా తన్నీరు రమేశ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బెల్లంపల్లి నుంచి ములుగుకు బదిలీపై రాగా, ఇక్కడ పనిచేసిన సంపత్‌ బెల్లంపల్లి కమిషనర్‌గా బదిలీపై వెళ్లారు. కాగా బాధ్యతల స్వీకరణ అనంతరం కమిషనర్‌ రమేశ్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలన్నారు. ములుగు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

ములుగు రూరల్‌: తూకంలో మోసం చేస్తే శాఖపరమైన చర్యలు తప్పవని ఉమ్మడి భూపాలపల్లి జిల్లా లీగల్‌ మెట్రాలజీ అధికారి శ్రీలత హెచ్చరించారు. శుక్రవారం ములుగు మండలపరిధిలోని మేడివాగు వద్ద చేపలు విక్రయిస్తున్న వారి వద్ద బాట్లను పరిశీలించారు. పస్రాలో చికెన్‌ సెంటర్లు, మాంసం దుకాణాలు, జవహార్‌నగర్‌, పస్రా పెట్రోల్‌ బంక్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిబంధనల మేరకు తూనికలు, కొలతలు సరిగా లేని కాంటాలు, బాట్లను సీజ్‌ చేసి కేసులు నమోదు చేశామన్నారు. కార్యక్రమంలో తూనికలు, కొలతల టెక్నికల్‌ అసిస్టెంట్‌ హఫీజ్‌, సిబ్బంది పాషా, శివకుమార్‌, సలీం, వినియోగదారులు సమాఖ్య అధ్యక్షుడు చల్లగురుగుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఏటూరునాగారం: మేడారం జాతరలో అమ్మవార్ల గద్దెల వద్ద భక్తులను అదుపు చేయడంలో సంబంధిత శాఖలు ఇబ్బంది పడుతున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మొగుళ్లభద్రయ్య అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భక్తులు తీసుకువచ్చే బెల్లం, ప్రసాదాలను గద్దెలపై విసిరేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకురావాలన్నారు. భక్తుడికి దర్శనం అనంతరం ఉచితంగా బెల్లం, ప్రసాదం అందించే కౌంటర్లు ఏర్పాటు చేస్తే ఈ పరిస్థితి నిర్మూలించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు, మనోహర్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు మంత్రి పొన్నం రాక

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ నేడు (శనివారం) మేడారం రానున్నారు. మేడారంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్‌స్టేషన్‌, ప్రయాణికులు క్యూ లైన్లు, ఆర్టీసీ ఉద్యోగుల విశ్రాంతి షెడ్డులు, జాతర స్పెషల్‌ బస్సులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు మేడారం బస్టాండ్‌ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు.

రిపబ్లిక్‌ డేకు  ఏర్పాట్లు చేయాలి
1
1/2

రిపబ్లిక్‌ డేకు ఏర్పాట్లు చేయాలి

రిపబ్లిక్‌ డేకు  ఏర్పాట్లు చేయాలి
2
2/2

రిపబ్లిక్‌ డేకు ఏర్పాట్లు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement